వర్షం వస్తుందని ఫ్లై ఓవర్ కింద నిల్చుంటే.. స్కూల్ బస్సు వచ్చి ఢీకొట్టింది

వర్షం వస్తుందని ఫ్లై ఓవర్ కింద నిల్చుంటే.. స్కూల్ బస్సు వచ్చి ఢీకొట్టింది

ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరూ ఊహించలేరు.. వర్షం వస్తుందని.. ఫ్లై ఓవర్ కింద ఉన్న ఓ యువతిని.. స్కూల్ బస్సు ఢీకొన్న ఘటన హైదరాబాద్ సిటీలో జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చావు బతుకుల మధ్య పోరాడుతుంది ఆ యువతి. 2024. ఆగస్ట్ 20వ తేదీ జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ సిటీ రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 130 దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్తాపూర్ కు చెందిన హారిక అనే యువతి ఆఫీసుకు వెళ్లటానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ సమయంలో వర్షం పడుతుంది. దీంతో తడవకుండా ఉండేందుకు ఫ్లై ఓవర్ కింద నిల్చుంచి. సరిగ్గా ఈ సమయంలోనే అటుగా వస్తున్న స్కూల్ బస్సు.. హారికను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హారిక కొద్ది దూరం ఎగిరి పడింది. 

ప్రమాదం తర్వాత హారికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. హారిక ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలిపారు బంధువులు.