ఖమ్మం బైపాస్ రోడ్డు టేకులపల్లి బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్ ను లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో బస్సు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
ప్రమాద సమయంలో బస్సులో 30 విద్యార్థులు ఉన్నారు. వారిలో పలువురికి గాయాలయ్యాయి. 4వ తరగతి విద్యార్థి అయ్యాన్ (9) తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు కాకతీయ టెక్నో స్కూల్ కు సంబంధించిందిగా పోలీసులు గుర్తించారు.