అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన స్కూల్ బస్సు

అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన స్కూల్ బస్సు
  • చీర్యాల గ్రామ పరిధిలో 30  మంది చిన్నారులకు స్వల్ప గాయాలు
  • డ్రైవర్ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రుల ఆరోపణ

కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామ పరిధిలో ఉన్న డివైన్ స్కూల్ బస్సు కుందన్ పల్లి వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చీర్యాల గ్రామ శివారులోని  డివైన్ స్కూల్ బస్సు అదుపు తప్పి ఢీకొట్టగా 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు నుంచి స్టూడెంట్లను  బయటకు తీశారు.  కాగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపించడం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవర్ ఒంటెద్దు రాజు పై కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.