మేడ్చల్ జిల్లా బండ మందారంలో స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన ఈ ఘటన సోమవారం ( డిసెంబర్ 9, 2024 ) జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ మండలం బండ మందారం దగ్గర చాణక్య విజన్ స్కూల్ కి చెందిన బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 20మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. స్కూల్ వదిలాక రాయులపూర్ నుండి బండ మందారం గ్రామంలో కి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి అపాయం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ | రూ. 4 లక్షలకు ముగ్గురు కొడుకులను అమ్మేసిన తల్లి
ప్రమాద సమయంలో అక్కడే ఉన్న గ్రామస్థులు సకాలంలో స్పందించి విద్యార్థులను రక్షించారు. బస్సును రోడ్డు పైకి చేర్చి పిల్లలను బయటికి తీశారు గ్రామస్తులు. పలువురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.