స్టూడెంట్లను చితకబాదిన స్కూల్​ చైర్మన్​ కొడుకు

స్టూడెంట్లను చితకబాదిన స్కూల్​ చైర్మన్​ కొడుకు

శామీర్ పేట, వెలుగు: క్రికెట్​ ఆడుకునేందుకు పర్మిషన్​ ఇవ్వాలని అడిగినందుకు స్కూల్​ చైర్మన్ ​కొడుకు స్టూడెంట్లను చితకబాదాడు. ఈ ఘటన శామీర్ పేట పీఎస్​పరిధిలో జరిగింది. శామీర్ పేటలోని సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ పాఠశాల హాస్టల్ లో ఉంటున్న ఆరుగురు స్టూడెంట్లు గత నెల 28న క్రికెట్​ఆడుకునేందుకు పర్మిషన్​ఇవ్వాలని చైర్మన్​కొడుకు అభిలాశ్​​ను అడిగారు. 

పర్మిషన్ ​ఇవ్వకపోగా సదరు స్టూడెంట్లకు వాతలు పడేలా కొట్టాడు. కొట్టినట్లు పేరెంట్స్​తో చెబితే చంపుతానని బెదిరించాడు. బాధిత స్టూడెంట్లలో ముగ్గురు ఇటీవల ఇండ్లకు వెళ్లారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలతో కలిసి సోమవారం అభిలాశ్​పై డీఈఓకు, శామీర్​పేట పీఎస్​లో ఫిర్యాదు చేశారు.