యూట్యూబ్‌లో చూసి 400 అకౌంట్లు హ్యాక్ చేసి అమ్మాయిలను బ్లాక్ మెయిల్

లక్నో: అతడు ఎనిమిదో తరగతిలోనే బడి మానేసిండు. యూట్యూబ్ లో వీడియో చూసి సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయడం నేర్చుకున్నడు. ఆ ట్రిక్ తో ఒకట్రెండు కాదు.. ఏకంగా 400 మంది అమ్మాయిల అకౌంట్లను హ్యాక్ చేసిండు. వాళ్ల ఫొటోలు, వీడియోలు, చాట్స్ సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. చివరికి ఒక అమ్మాయి కంప్లయింట్ తో పోలీసులకు దొరికిండు. స్కూల్ డ్రాపౌట్ అయిన నిందితుడు.. సైబర్ క్రిమినల్స్ తరహాలో ఇంతమంది అకౌంట్లను హ్యాక్ చేయడంపై పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యూపీలోని లక్నోకు చెందిన వినీత్ మిశ్రా(26).. అమ్మాయిలకు వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఓ వెబ్ లింక్ ను పంపేవాడు. అది ఓపెన్ చేయగానే ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్ అడిగేది. వాటి ద్వారాఅమ్మాయిల అకౌంట్లను హ్యాక్ చేసేవాడు. వాళ్ల సీక్రెట్ ఫొటోలు, వీడియోలు, చాట్స్ సేకరించి బెదిరించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు లీక్‌‌ చేస్తానని బెదిరించేవాడు.

For More News..

సర్కారు తీరు మారితేనే మహిళలకు భరోసా

నౌకరీ వచ్చినా పోస్టింగ్​ ఇస్తలే.. 140 మంది ఎదురుచూపులు

ఫిట్​మెంట్ 43% పైనే ఇయ్యాలి.. తగ్గిస్తే తడాఖా చూపిస్తం..