ఘట్ కేసర్, వెలుగు: పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతాపసింగారం జడ్పీహెచ్ఎస్ను స్టేట్స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, ఎస్సీఈఆర్ డైరెక్టర్ రమేశ్ మంగళవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. హెచ్ఎం రవి కుమార్, టీచర్లను అభినందించారు. పదో తరగతి స్టూడెంట్లు ఏఐ గురించి వివరించడాన్ని మెచ్చుకున్నారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, ఏఎంఓ రవీందర్ రాజు ఉన్నారు.