
కాగజ్ నగర్, వెలుగు: చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని స్కూల్గేటుకు కాంట్రాక్టర్ తాళం వేశాడు. ‘మన ఊరు మన బడి’ కింద ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని పెట్రోల్ పంపు ఏరియాలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ ను కాంట్రాక్టర్ అబీబ్ రూ.97 లక్షలతో నిర్మించాడు. బిల్డింగ్ కట్టి 8 నెలలు గడుస్తున్నా బిల్లులను ప్రభుత్వం ఇవ్వడం లేదని సోమవారం స్కూల్ గేటుకు తాళం వేశారు.
దీంతో ఫైనల్ పరీక్ష నేపథ్యంలో బడికి వచ్చిన విద్యార్థులు.. గేటు ముందు పడిగాపులు కాశారు. గంట పాటు వేచి చూసిన తర్వాత ‘మన ఊరు మన బడి’ ప్రత్యేకాధికారి స్పందించి ఇప్పటికే బిల్లులను స్టేట్ ఆఫీస్ కు పంపామన్నారు. వెంటనే బిల్లు వచ్చేలా కృషి చూస్తామని చెప్పడంతో కాంట్రాక్టర్ తాళం చివరకు తీశాడు.