Viral Video: అయ్యోపాపం.. బడికి వెళ్లాలంటే.. రోప్ వేతో నది దాటాల్సిందే..

Viral Video: అయ్యోపాపం.. బడికి వెళ్లాలంటే.. రోప్ వేతో   నది దాటాల్సిందే..

ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు .. అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీలు గుప్పిస్తుంటారు.  అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేస్తామని సాధారణంగా చెబుతుంటారు.  నేటి బాలలే .. రేపటి పౌరులు అని చెప్పడం.. కేవలం మాటలకే పరిమితమవుందని.. ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్దమవుతుంది.  మారు గ్రామాల పిల్లలు బడికి వెళ్లాలంటే.. బస్సు... ప్రైవేటు వాహనాలను సాధారణంగా ఉపయోగించుకుంటారు.  కాని ఈ వీడియోలో పాఠశాలకు వెళ్లే పిల్లలు తాడు ( రోప్​)ను ఉపయోగించి నది దాటి వెళ్లాల్సిందే.

ఉత్తరాఖండ్​లోని  మున్సియరిలో నివసించే పిల్లలు బడికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  ప్రతిరోజు పుస్తకాల బ్యాగ్​ను వీపునకు తగిలించుకొని రెండు చేతులతో తాడును పట్టుకొని రోప్ వేతో నదిని దాటుతున్నారు. 

ఏ ప్రభుత్వం  చెప్పిన  తామే అభివృద్ది చేస్తున్నామని చెప్పే రాజకీయపార్టీల పెద్దలకు ఈ పిల్లల కష్టాలు కనపడలేదు. ఆడపిల్లలను చదివించడం ..  ఆడపిల్లలను రక్షించడం అంటే ఇదేనా మన వ్యవస్థ అని  ఓ వ్యక్తి ఈ వీడియోలో చెప్పాడు.  ఓ విద్యార్థిని తాను 5 వ తరగతి నుంచి ఇలానే పాఠశాలకు వెళుతున్నానని.. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుచున్నానని చెప్పింది.  

త్రిభువన్ చౌహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ...త్రిభ్‌చౌహాన్...లో షేర్ చేసిన వీడియో  పోస్ట్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటికే ( వార్త రాసే సమయానికి)  18.4 మిలియన్ల వీక్షణలను పొందింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.  చాలామంది బాలికల ధైర్యసాహసాలను ప్రశంసించారు.  మరికొందరు ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.  ఇంకొందరు ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు..ఇంత తీవ్ర బాధ్యతారాహిత్యమా అని ప్రశ్నించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను కలుగజేయరా.. అవినీతి పీక్​ స్టేజీలో ఉందని మరో వినియోగదారుడు స్పందించాడు.  విద్యార్థులు బడికి వెళ్లేందుకు రోప్​ వేను ఉపయోగించడం విచారకరం..  సిగ్గుచేటంటూ .. నెటిజన్ల స్పందనలతో కామెంట్​​ బాక్స్​ నిండిపోయింది.ఇప్పటికైనా ఉత్తరాఖండ్​ ప్రభుత్వం.. కనీసం పిల్లల అవసరాలను తీర్చే దిశగా ఈ నదిపై వంతెన నిర్మించాలని పలువురు కోరుతున్నారు.