స్కూల్ హెడ్ మాస్టర్ ఆత్మహత్య.. షేర్ మార్కెట్ లో 60 లక్షలు లాస్

స్కూల్ హెడ్ మాస్టర్ ఆత్మహత్య.. షేర్ మార్కెట్ లో 60 లక్షలు లాస్

ఏపీలో దారుణం జరిగింది.. అప్పుల బాధతో ఓ హెడ్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న భాస్కర్ బాబు స్నేహితులను నమ్మి షేర్ మార్కెట్, ఆన్లైన్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిన భాస్కర్ లోన్ యాప్ లు, బ్యాంకులు, సన్నిహితుల దగ్గర అప్పు చేసి మరీ రి. 60లక్షలు పెట్టుబడి పెట్టాడు.

కొంతకాలం పాటు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇచ్చిన స్నేహితులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎలాంటి లాభం, అసలు కూడా ఇవ్వలేదు. ఏ క్రమంలో  అప్పుల భారం పెరిగి బ్యాంకులు, లోన్ యాప్ లకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడ్డాడు భాస్కర్ బాబు ఒక పక్క ఈఎంఐల టెన్షన్ మరో పక్క బయటి వ్యక్తులు పెరిగి... అప్పుల బాధ భరించలేక ఆదివారం ( డిసెంబర్ 22, 2024 ) సూసైడ్‌ నోట్ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు భాస్కర్. 

ALSO READ | వీడియో: స్కూల్ బస్సు టైర్ బరస్ట్.. గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్

పురుగుల మందు తాగిన భాస్కర్ ను స్థానికులు హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.