పాఠశాలలో హెడ్మాస్టర్ వేధింపులు.. చితకబాదిన బాలిక పేరెంట్స్

  • స్కూల్ కు వెళ్లి చితకబాదిన బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు
  • సస్పెండ్ చేయాలంటూ ఆందోళన
  • బదిలీ చేస్తామన్న ఎంఈవో

వికారాబాద్,వెలుగు: మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హెడ్ మాస్టర్ ను బాలిక పేరెంట్స్, బంధువులు చితకబాదారు. ఈ ఘటన నవాబుపేట మండలంలో జరిగింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బాలిక వికారాబాద్ లోని నవాబుపేటలో ని ఓ గ్రామంలో ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అదే గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతోంది. కుర్వ కిష్టయ్య ఆ స్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నాడు. 3 నెలలుగా కిష్టయ్య బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సెల్ ఫోన్ లో అసభ్యకర చిత్రాలను చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కిష్టయ్య చేష్టల గురించి బాలిక తన పేరెంట్స్ కు చెప్పింది. దీంతో సోమవారం తల్లిదండ్రులు, అర్కతలో ఉంటున్న బాలిక బంధువులు స్కూల్ కు వెళ్లి హెడ్ మాస్టర్ కిష్టయ్యను చితక బాదారు. విషయం తెలుసుకున్న ఎంఈవో, స్థానికుల పోలీసులు స్కూల్ కు చేరుకున్నారు. ఘటనపై ఆరాతీశారు. కిష్టయ్య బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడన్నది వాస్తమేనని..విచారించి చర్యలు తీసుకుంటామని ఎంఈవో చెప్పారు. అతడిని బదిలీ చేస్తామన్నారు. కిష్టయ్యను సస్పెండ్ చేయాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

school-headmaster-sexual-assault-on-a-minor-girl