స్టూడెంట్స్ కు పండగే.. సెప్టెంబర్ నెలలో ఎన్ని సెలవులంటే..

ఈ సంవత్సరం సెప్టెంబరులో వరుస పండుగలను పురస్కరించుకుని నెల అంతా సెలవులతో నిండి పోయింది. ఈ సెలవు జాబితా ప్రకారం, విద్యార్థులకు సెప్టెంబర్ 5 (ఉపాధ్యాయుల దినోత్సవం), సెప్టెంబర్ 6 లేదా 7 (జన్మాష్టమి), సెప్టెంబర్ 19 (గణేష్ చతుర్థి), సెప్టెంబర్ 28 (మిలాద్ ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్) తేదీలలో సెలవులు వస్తాయని భావిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే.. ప్రభుత్వం 2023 సంవత్సరానికి గానూ ఇప్పటికే సెలవుల జాబితాను ప్రకటించింది. జూన్ 12నుంచి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కాగా.. 1నుంచి 10వ తరగతులకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను తెలంగాణ ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది. దీని ప్రకారం ఈ విద్యా సంవత్సరలో సెప్టెంబర్ లో ఆదివారాలతో కలిపి మొత్తం 7రోజులు సెలవులు వస్తున్నాయి.

ALSO READ:వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. గతంలో ఎప్పుడైనా జరిగాయా .. !

సెప్టెంబరు 5 ఉపాధ్యాయుల దినోత్సవం. ఇది భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని సూచిస్తుంది. సెప్టెంబర్ 6 లేదా 7న జన్మాష్టమి. ప్రతి సంవత్సరం, పవిత్రమైన జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినాన్నే జన్మాష్టమిగా స్మరించుకుంటారు.  సెప్టెంబరు 19న గణేష్ చతుర్థి. గణేష్ చతుర్దశి లేదా వినాయక చతుర్దశి అని కూడా పిలిచే గణేష్ చతుర్థి, గణేశుడి జననాన్ని సూచిస్తుంది. సెప్టెంబరు 28న మిలాద్ ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్. ఈద్-ఎ-మిలాద్ అనేది ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. ఆగస్టు 23న, ఢిల్లీ ప్రభుత్వం G20 శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 8 నుండి 10 వరకు దేశ రాజధానిలో పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీ జిల్లాలోని అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు వాణిజ్య సంస్థలు మూసివేయబడతాయని నోటిఫికేషన్ తెలిపింది.