స్కూళ్లకు వేసవి సెలువులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఏప్రిల్ 25 నుంచి  జూన్ 11 వరకు పాఠశాలలకు సెలవులిచ్చింది.  జూన్ 12న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపింది.
 ఒకటి నుండి 9 వ తరగతి విద్యార్ధులకు సెలవులు ఉంటాయి. 10వ తరగతి విద్యార్థులకు రివిజన్ తరగతులు  ప్రారంభం అవుతాయి. ప్రతి రోజు ఒక టీచర్ స్కూల్ కు హాజరై పదో తరగతి విద్యార్ధులకు రివిజన్ క్లాసులు నిర్వహిస్తారు.

 జూన్ 1వ తేదిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించనుంది విద్యాశాఖ. ఈ క్రమంలో   ఉపాధ్యాయులు విధులకు హాజరుకావాలని ఆదేశించింది. వేసవి సెలవుల్లో మన ఊరు మన బడి మన బస్తీ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.  స్కూల్స్ రీ ఓపెన్  నాటికి విద్యార్థులకు పుస్తకాలు..యూనిఫారాలు  అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది.