వరంగల్ జిల్లాలో ఓ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నర్సంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ ఈ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం(సెప్టెంబర్ 27) యథావిధిగా పాఠశాల ప్రారంభమైంది. విద్యార్థులు అందరూ క్లాస్ రూంలోకి వెళ్లి చదువుకుంటున్నారు. అయితే మధ్యాహ్న సమయంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరు బయటకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలోనే క్లాస్ రూం ముందు ఉన్న స్లాబ్ పెచ్చులు ఉడి ఒక్కసారిగా ఆ విద్యార్థులపై పడింది. దీంతో వారిద్దరి తలకు గాయాలయ్యాయి.
వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో పాఠశాలలో ఎప్పుడు ఏ పెచ్చు ఊడి వారిపై పడుతుందో అని విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.