విద్యుత్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌తో సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌...

విద్యుత్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌తో సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌...
  • స్కూల్‌‌‌‌‌‌‌‌లో జెండా కర్ర సరి చేస్తుండగా ప్రమాదం
  • భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలో ఘటన

మణుగూరు, వెలుగు : స్కూల్‌‌‌‌‌‌‌‌లో కింద పడిన జెండాను సరిచేస్తుండగా విద్యుత్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌ చనిపోయారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం వాగు మల్లారం గ్రామంలో ఆదివారం జరిగింది. శివలింగాపురం గ్రామానికి చెందిన బేతం రత్నం (55), కాళీమాత ఏరియాకు చెందిన తెగుళ్ల ఉపేందర్‌‌‌‌‌‌‌‌ (42)వాగు మల్లారం గ్రామంలోని గ్రేస్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. 

ఆదివారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో స్కూల్‌‌‌‌‌‌‌‌లోని జెండా పడిపోవడంతో దానిని సరి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జెండా రాడ్‌‌‌‌‌‌‌‌ను పైకి లేపగా అది పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్‌‌‌‌‌‌‌‌ వైర్లకు తగిలింది. దీంతో షాక్‌‌‌‌‌‌‌‌ కొట్టి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న మణుగూరు డీఎస్పీ రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఐ సతీష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్కూల్‌‌‌‌‌‌‌‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, మృతుల ఫ్యామిలీలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా చెల్లించాలని ప్రజలు, బంధువులు ఆందోళనకు దిగారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావులు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.