
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా 26న స్కూళ్ల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ నగర కార్యదర్శి చింతల పవన్ కుమార్ తెలిపారు. శనివారం సిద్దిపేటలో మాట్లాడుతూ గుర్తింపు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఫణీందర్, శ్రీషాంత్, నవీన్, కిట్టు, మహేశ్, ఆకాశ్, భువన్ తదితరులు పాల్గొన్నారు.