ఏపీలోని నరసరావుపేటలో స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నరసరావుపేటలోని హార్ట్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ళ జయలక్ష్మి హాస్టల్ రూములోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ( సెప్టెంబర్ 17, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పెదయలమంద, సుబ్బమ్మల ఫిర్యాదు మేరకు నరసరావుపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.