కీచక టీచర్ ..చాక్లెట్లు డబ్బులు ఆశచూపి విద్యార్థినిలపై లైంగిక దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు  కామాందుడిగా మారి మైనర్ విద్యార్థులపై  లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత కొంత కాలంగా 3 వ తరగతి విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడు. 

చాక్లెట్స్,డబ్బులు ఆశ చూపి ఆరుగురు స్టూడెంట్స్ పై   ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఓ స్టూడెంట్స్ అనారోగ్యానికి గురి కావడంతో కామాంధుడి భాగోతం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు  చేసిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో నిందితుడు ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.