లెక్కల్లో తప్పు చేశాడని చితక బాదిండు

లెక్కల్లో తప్పు చేశాడని చితక బాదిండు
  • ఒక్కో తప్పుకు 10 దెబ్బలు కొట్టిన టీచర్​
  • మూడో తరగతి స్టూడెంట్​కు గాయాలు 

మియాపూర్, వెలుగు: లెక్కల్లో తప్పు చేశాడని మదీనాగూడ గవర్నమెంట్​స్కూల్​టీచర్ ​మూడో తరగతి స్టూడెంట్​ను చితకబాదాడు. వాతలు పడేలా కొట్టాడు. సదరు టీచర్​పై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి మియాపూర్​పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. మదీనాగూడకు చెందిన దేవిప్రసాద్ స్థానిక గవర్నమెంట్​స్కూల్​లో మూడో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే శనివారం స్కూలుకు వెళ్లాడు.

అయితే లెక్కలు తప్పుగా చేశాడని టీచర్​గోవర్థన్ బాలుడిని చితకబాదాడు. ఒక్కో తప్పుకు దెబ్బలు అంటూ కర్రతో ముఖం, శరీరం కమిలిపోయేలా కొట్టాడు. గాయాలతో ఇంటికి వచ్చిన దేవిప్రసాద్​ను చూసిన తండ్రి శివ మియాపూర్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇలాగే ముక్కుపై గుద్దడంతో బ్లడ్​వచ్చిందని, హెచ్ఎంకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.