సైకిళ్ల పంపిణీకి అడ్డు చెప్పిన టీచర్లు.. ఉపాధ్యాయులతో పేరెంట్స్​ వాగ్వాదం

సైకిళ్ల పంపిణీకి అడ్డు చెప్పిన టీచర్లు.. ఉపాధ్యాయులతో పేరెంట్స్​ వాగ్వాదం

నర్వ, వెలుగు: మండలంలోని పాతర్చేడ్  గ్రామంలో శుక్రవారం మక్తల్  బీఆర్ఎస్  నేత వీజేఆర్  ఫౌండేషన్  అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి హైస్కూల్  విద్యార్థినులకు 100 సైకిళ్లను పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి స్కూల్​ టీచర్లు అడ్డుచెప్పడం వివాదాస్పదంగా మారింది. కలెక్టర్  పర్మిషన్  లేకుండా పంపిణీ చేయవద్దని అడ్డుకున్నారు. దీంతో పేరెంట్స్​ ఉపాద్యాయులపై తిరగబడి ఒక మంచి పని చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. ఎవరు వచ్చి ఆపుతారో చూస్తామని గ్రామస్తులు దగ్గరుండి సైకిళ్లు పంపిణీ చేశారు. దీంతో టీచర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

విద్యార్థులకు అండగా ఉంటాం

ఊట్కూర్: విద్యార్థులకు అండగా ఉంటామని వీజేఆర్  ఫౌండేషన్  అధినేత జగన్నాథ్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని గవర్నమెంట్​ జూనియర్ కాలేజీలో  బోర్  రిపేర్​ కోసం రూ.25 వేలు అందజేశారు. సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ప్రిన్సిపాల్  అంబాజీ, లెక్చరర్లు సత్యనారాయణ, బసయ్య, మంజునాథ్, కల్పన, అశోక్, మహేశ్​ పాల్గొన్నారు.