
- హనుమకొండ ఎమ్మార్పీ బిల్డింగ్ వెనక పడేసిన సిబ్బంది
- సోషల్ మీడియాలో వైరల్
- మళ్లీ ఆఫీసులో పెట్టించామన్న ఎంఈఓ
హనుమకొండ, వెలుగు: సర్కారు బడుల్లోని విద్యార్థుల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫామ్స్ చెత్తకుప్పలోకి చేరాయి. స్డూడెంట్స్కు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యూనిఫామ్స్ కుట్టించి హనుమకొండలోని ఎమ్మార్సీ సెంటర్కు పంపించింది. ఇప్పటికే స్కూళ్లకు పంపిణీ చేయగా..ఇంకొన్ని యూనిఫామ్స్, క్లాత్ ఎమ్మార్సీ సెంటర్లలోనే మిగిలిపోయాయి. ఇదిలాఉంటే మిగిలిన స్టాక్ ఎందుకనుకున్నారో , వాటితో పని లేదనుకున్నారో ఏమో గానీ, అక్కడి సిబ్బంది యూనిఫామ్స్ కట్టలను ఎమ్మార్సీ బిల్డింగ్ గోడ వెనుక పడేశారు. ఒక పెద్ద బ్యాగ్లో పెట్టి వాటిని చెత్తకుప్పలో వదిలేశారు. దీంతో అటుగా వెళ్తున్న కొంతమంది యువకులు ఫొటోలు, వీడియోలు తీసి గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్గా మారాయి.
ఇప్పటికే చాలాచోట్ల యూనిఫామ్స్సరిపోక, కొన్నిచోట్ల కొలతలు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా.. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన యూనిఫామ్స్ ను చెత్తకుప్పలో పడేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై హనుమకొండ ఎంఈఓ ఈ.రామ్కిషన్రాజును వివరణ కోరగా.. ఆఫీస్లో పని చేసే సిబ్బంది తమకు తెలియకుండా యూనిఫామ్స్బయటపడేసిన విషయం వాస్తవమేనన్నారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే యూనిఫామ్స్మళ్లీ ఆఫీస్గదిలోకి మార్పించినట్లు తెలిపారు. ఈ విషయంలో సిబ్బందిని కూడా హెచ్చరించినట్లు వివరించారు.