బడిగంట మోగింది

బడిగంట మోగింది

వేసవి సెలవులు ముగియడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు బుధవారం రీఓపెన్ అయ్యాయి. దీంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు.  తొలి రోజు హాజరు శాతం తక్కువగా నమోదైంది. పటాన్​చెరు జెడ్పీహెచ్ఎస్​లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, సిద్దిపేట మండల పరిధిలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్​లో  ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి,  నారాయణఖేడ్ ఖేడ్​లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ పాఠశాలలలో డీఈవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ మను చౌదరి కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా ​కొల్చారం మండలంలోని వైమాందాపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ మధ్యాహ్న భోజనం చేశారు. - నెట్​వర్క్, వెలుగు