ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కాగా, కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యం సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత స్కూళ్లు, కాలేజీలను ఈ నెలాఖరు వరకు మూసేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే నాటి నుంచి విద్యా సంస్థలను రీ ఓపెన్ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు చేస్తున్నాయి. మరోవైపు కరోనా ఆంక్షలపై హైకోర్టులో విచారణ సందర్భంగానూ విద్యా సంస్థలను ఫిబ్రవరి 1 నుంచి తెరవబోతున్నారా? అని సర్కారును న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో ఇవాళ వైద్య శాఖ ఇచ్చిన రిపోర్టుపై విద్యాశాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని వైద్యశాఖ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విద్యా సంస్థలకు సంక్రాంతి తర్వాత పొడిగించిన సెలవులకు ముగింపు చెప్పి.. ఫిబ్రవరి 1 నుంచి  ఓపెన్ చేయాలని విద్యా శాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు

మీ పాలనలో నిరుద్యోగం పెరిగింది నిజం కాదా..?

మహిళా కమిషన్ నోటీసులు.. గర్భిణుల రూల్ మార్చిన ఎస్బీఐ