అక్టోబర్ 31 వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవద్దు

15 నుంచి పీజీ క్లాసులకు పర్మిషన్​

టాకీసులు, అమ్యూజ్​మెంట్​ పార్కులు కూడా ఓపెన్​

స్పోర్ట్స్ ట్రైనింగ్​, స్విమ్మింగ్​పూల్స్ రీస్టార్ట్​

పెండ్లిండ్లు, ఇతర ప్రోగ్రామ్స్​కు 100 మంది వరకు ఓకే

అన్‌‌లాక్ 5.0 గైడ్​లైన్స్​ ఇచ్చిన రాష్ట్ర సర్కార్

పీజీ ఆపై కోర్సుల క్లాసులకు 15 నుంచి పర్మిషన్​

హైదరాబాద్, వెలుగు: అన్​లాక్ 5.0 కి సంబంధించిన గైడ్​లైన్స్ రాష్ట్ర సర్కార్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి పలు రకాల ఇనిస్టిట్యూట్స్, బహిరంగ కార్యక్రమాలకు పర్మిషన్​ ఇచ్చింది. కంటెయిన్​మెంట్ జోన్లలో ఈ నెల 31వ తేదీ వరకు కఠిన లాక్ డౌన్ అమలవుతుందని చెప్పింది. కంటెయిన్​మెంట్ జోన్ల బయట అకడమిక్, స్పోర్ట్స్, సోషల్, కల్చరల్, ఎంటర్​టైన్​మెంట్, పొలిటికల్​, రిలీజియస్​ ప్రోగ్రామ్స్​కు అనుమతి ఇచ్చింది అయితే వంద మంది కంటే ఎక్కువ హాజరు కాకూడదని రూల్ పెట్టింది. అట్లనే ఆయా ప్రోగ్రామ్స్​లో తప్పనిసరిగా మాస్కులు ధరించటంతోపాటు ఫిజికల్ డిస్టెన్స్​పాటించాలని సూచించింది.

31 వరకు ఆన్ లైన్​ క్లాస్​లే

కాలేజీలు, హైయ్యర్​ ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్లు ఈ నెల 31వరకు ఆన్ లైన్ క్లాసులే కొనసాగించాలని సర్కార్ పేర్కొంది. స్కూళ్లు, కోచింగ్ సెంటర్ల రీస్టార్ట్​కు సంబంధించిన స్పెషల్​ గైడ్​లైన్స్​త్వరలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. కాలేజీలు, హైయ్యర్​ ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్లలో ఆన్‌‌లైన్/ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పద్ధతిలోనే టీచింగ్​ కొనసాగించాలని చెప్పింది. పీహెచ్​డీ స్కాలర్లు, ల్యాబరేటరీల్లో రిసెర్చ్ చేయాల్సిన టెక్నికల్ కోర్సులు చదివే పీజీ స్టూడెంట్ల కోసం ఈ నెల 15 నుంచి హైయ్యర్​ ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్లు ప్రారంభించవచ్చని స్పష్టం చేసింది. కరోనా రూల్స్​ పాటిస్తూ స్పోర్ట్స్ మెన్ ట్రైనింగ్​కు, స్విమ్మింగ్ పూల్స్​కు ఈ నెల 15 నుంచి పర్మిషన్​ ఇచ్చింది.

వందమందికి దాటితే పర్మిషన్ కావాలి

ఎంటర్​టైన్మెంట్ పార్కులు, టాకీసులు, మల్టిప్లెక్సులకు స్పెషల్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. బీ టు బీ ఎగ్జిబిషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభించవచ్చని… అయితే మాస్కులు, థర్మల్ స్కానర్లు తప్పని సరిగా వినియోగించాలని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాల వంటి వాటికి వంద మందికి మించి హాజరయ్యేందుకు స్థానిక కలెక్టర్ లేక ఆరోగ్య, పోలీసు శాఖల నుంచి అనుమతులు తప్పనిసరని పేర్కొంది. పదేండ్ల లోపు చిన్నారులు, 65 ఏండ్లు పైబడిన వారు, గర్భిణులు వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని సూచించింది.

దసరా తర్వాత పరిస్థితిని బట్టి…

కరోనా ఎఫెక్ట్​తో ఇప్పట్లో బడులు తెరిచే పరిస్థితి లేదనీ, దసరా తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. అప్పటికీ కరోనా కేసులు తగ్గితే.. సీఎం కేసీఆర్​పర్మిషన్ తీసుకొని బడులు తెరవాలని అభిప్రాయానికి వచ్చింది. బుధవారం ఎంసీఆర్​హెచ్​ర్డీలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ తో కలిసి విద్యా, సంక్షేమశాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ప్రారంభం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రివ్యూ చేశారు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగలున్నాయనీ, ఈ టమ్​లో బడులు తెరిస్తే కొత్త సమస్యలు వస్తాయని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెరిస్తే ముందుగా ఎనిమిదో క్లాస్​ నుంచి ఇంటర్ వరకూ మాత్రమే ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 86శాతం స్టూడెంట్లు ఆన్​లైన్ క్లాసులు వింటున్నారని, అవి అందరికీ చేరేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం గైడ్ లైన్స్ కు అనుగుణంగా విద్యాసంస్థలు ఎలా నిర్వహించాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ… ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీలు యూజీసీ నిబంధనల ప్రకారం వచ్చే నెల ఫస్ట్​ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. సమావేశంలో స్పెషల్ సీఎస్​ చిత్రారాంచంద్రన్​, వివిధ శాఖల ఉన్నతాధికారులు బుర్రా వెంకటేశం, రాహుల్ బొజ్జా, క్రిస్టినా చోంగ్తూ, ప్రవీణ్​కుమార్, నవీన్​ మిట్టల్, ఉమర్ జలీల్, దేవసేన తదితరులు పాల్గొన్నారు.

For More News..

కల్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యరు.. లోన్లు అడిగితే ఇచ్చే దిక్కు లేదు..

సిటీలో 1,13,824 రాంగ్ అండ్ ఫేక్ నంబర్‌‌ ప్లేట్స్

ఛేజింగ్‌‌లో చేతులెత్తేసిన ధోనీసేన.. కేకేఆర్ చేతిలో ఓటమి