హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ తో క్లోజ్ అయిన స్కూల్స్, కాలేజీలు దాదాపు 10 నెలల తర్వాత సోమవారం పునః ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు, విద్యాశాఖ ఆదేశాల ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్స్, కాలేజీల్లో తరగతులు స్టార్ట్ చేశారు. తల్లిదండ్రుల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చిన స్టూడెంట్స్‌నే అనుమతించారు. తొలిరోజు జంట నగరాల పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌లో 55.43 శాతం అటెండెన్స్ నమోదైందని హైదరాబాద్ డీఈవో రోహిణి తెలిపారు.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు ప్రాంతాలలోని స్కూల్స్ ని తనిఖీ చేశారు. స్కూళ్లలో సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఒకచోట మధ్యాహ్న భోజన సమయం కావడంతో ఆమె స్వయంగా విద్యార్థులతో కలసి భోజనం చేశారు. తనతోపాటు భోజనం చేస్తున్న విద్యార్థులతో మాటా మంతి జరిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అలాగే సికింద్రాబాద్ అడ్డగుట్ట గవర్నమెంట్ స్కూల్ గేటు వద్ద ఎంవీ ఫౌండేషన్, తెలంగాణ తల్లుల సంఘం సభ్యులు స్కూల్ కి వచ్చే విద్యార్థులపై పూలవర్షం కురిపించారు. సిటీలోని జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ డే 50.-60 శాతం అటెండెన్స్ నమోదైందని డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జయప్రద తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 60శాతం స్టూడెంట్స్ స్కూల్స్‌కి అటెండ్ అయ్యారు.
స్కూల్‌కి రాని వారికి ఆన్లైన్ క్లాసులు
కోవిడ్ రూల్స్ ప్రకారం స్టూడెంట్స్ మాస్క్, హ్యాండ్ శానిటైజర్, లంచ్ బాక్స్, వాటర్ అన్నీ క్యారీ చేయాలని చెప్తున్నాం. బ్రేక్ టైమ్ లో అందరూ ఒకేసారి కాకుండా ఆరుగురు స్టూడెంట్స్ చొప్పున బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చారు. స్కూల్ కి రాని స్టూడెంట్స్ కు టీచర్లు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువగా అటెండ్ అయ్యారు. -సత్యనారాయణ, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, ఉప్పల్
డౌట్స్ క్లారిఫై అవుతున్నయ్
ఇన్ని రోజులు ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు వింటున్నా అనుమానాలు వస్తే డౌట్స్ క్లారిఫికేషన్ కి కాస్త ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం స్కూల్ కి రావడంతో క్లాస్ రూమ్ లో మిగతా స్టూడెంట్స్ కూడా డౌట్స్ అడుగుతున్నారు. చాలారోజుల తర్వాత డైరెక్ట్ గా టీచర్లు, ఫ్యాకల్టీతో ఇంట్రాక్ట్ అవుతున్నాం.డౌట్లు క్లియర్ చేసుకుని షేర్ చేసుకుంటున్నాము -ఎ.నందిని, టెన్త్‌క్లాస్, గడి స్కూల్, లాలాపేట
సేఫ్టీ ప్రికాషన్స్‌తో..
మా స్కూల్లో నైన్త్, టెన్త్ క్లాసు ల్లో 200 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఫస్ట్ డే వందమందికి పైగా అటెండ్ అయ్యారు. స్టూడెంట్స్ అందరికీ సీరియల్ నంబర్స్ ఇచ్చాం. క్లాస్‌లో ఆ నంబర్‌లోనే వారు కూర్చోవాలి. ఒకవేళ ఆ స్టూడెంట్ క్లాసుకి రాకపోయినా అక్కడ వేరేవాళ్లు కూర్చోవడానికి లేదు. ప్రతి స్టూడెంట్ను థర్మల్ స్కానింగ్ చేస్తున్నాం. వారికి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా వెంటనే పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తాం. రెండు ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశాం. దగ్గరలోని పీహెచ్ సీ డాక్టర్‌తో డైరెక్ట్ గా కాంటాక్ట్‌లో ఉన్నాం. -కృష్ణమూర్తి, హెడ్ మాస్టర్, సీతాఫల్ మండి హై స్కూల్.
ఇవి కూడా చదవండి
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
అనాథ శవాన్ని మోసి, అంత్యక్రియలు జరిపిన మహిళా ఎస్సై
3.79 కేజీల బంగారం.. 435 క్యారెట్ల వజ్రాల స్మగ్లింగ్