![ఢిల్లీ బాటలోనే హరియాణా.. స్కూళ్ల కు సెలవులు](https://static.v6velugu.com/uploads/2021/11/Schools-in-Gurugram,-Faridabad,-Sonipat-and-Jhajjar-to-be-closed-till-November-17-owing-to-pollution_vXuVRGtI8w.jpg)
ఢిల్లీలో గాలి కాలుష్యం పెరగడంతో అక్కడ స్కూల్స్, ఆఫీసులకు వారం పాటు సెలవులివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో అక్కడ నవంబర్ 15 నుంచి నవంబర్ 21 స్కూల్స్, ఆఫీసులు మూతపడనున్నాయి. ఇప్పుడు అదే బాటలో హరియాణా ప్రభుత్వం కూడా చర్యలకు దిగింది. ఢిల్లీకి సమీపంలో ఉన్నటువంటి గురుగ్రాం, ఫరీదాబాద్, సోనిపట్, జజ్జర్ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలను నవంబర్ 17 వరకు మూసివేయాలని ఉత్తర్వులు విడుదల చేసింది. అదేవిధంగా నిర్మాణ రంగానికి చెందిన పనులను కూడా ఆపేయాలని ఆదేశించింది. ఎటువంటి చెత్తను కాల్చకూడదని మున్సిపల్ బాడీస్ ని హెచ్చరించింది.
Haryana Government orders closing of all schools in Gurugram, Faridabad, Sonipat and Jhajjar till 17th November 2021 in wake of pollution situation in Delhi-NCR. pic.twitter.com/CqauRYJrrW
— ANI (@ANI) November 15, 2021
ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం.. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు.. ప్రైవేట్ ఉద్యోగులు కూడా వారం రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాలు జరిగే ప్రాంతాలన్నీ కూడా మూడు రోజుల పాటు బంద్ చేయాలని ఢిల్లీ సర్కార్ పేర్కొంది.