విద్యార్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని స్కూళ్లకు జనవరి 28 సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇస్లామిక్ మాసమైన రజబ్ 28న షబ్-ఎ-మెరాజ్ కోసం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. అయితే అన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించకపోవచ్చు. ఆప్షనల్ హాలిడే కాబట్టి మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో మైనారిటీ స్కూల్లు,కాలేజీలు మాత్రమే సెలవు ఇచ్చే అవకాశం ఉంది. జనవరి ఇదే చివరి హాలిడే
షబ్-ఎ-మెరాజ్
షబ్-ఎ-మెరాజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుక జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రాత్రి. ఈ రోజు ముస్లీంలు జాగరణ చేస్తారు. మసీదులను దీపాలతో అలంకరిస్తారు.