పేరెంట్స్‌పై మేనేజ్మెంట్ల ఒత్తిడి
టెస్ట్ పేపర్ కావాలంటే పైసల్ కట్టాలంటూ మెసేజ్‌లు
డీఈఓ లకు కంప్లయింట్ చేస్తే నో రెస్పాన్స్
స్కూల్స్ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న పేరెంట్స్
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల కోసం పేరెంట్స్ ను పరేషాన్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు పైసలు కట్టని స్టూడెంట్లను రీమూవ్ చేయడం, ఐడీ, పాస్ వర్డ్ తీసేయడం చేసిన మేనేజ్మెంట్లు ఇప్పుడు నయా స్టైల్ లో వెళ్తున్నాయి. ట్యూషన్ ఫీజు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేరెంట్స్ చెబుతున్నప్పటికీ టెస్ట్ ల పేరుతో మొత్తం వసూలు చేసేందుకు ఒత్తిడి చేస్తున్నాయి. స్టూడెంట్స్‌కు టెస్ట్ లు కండక్ట్ చేస్తున్నామని ఆ పేపర్స్ కావాలంటే మొత్తం ఫీజు కట్టాలని పేచీ పెడుతున్నాయి. దీనిపై డీఈఓలకు కంప్లయింట్ చేసిన రెస్పాన్స్ లేదు.
టెస్ట్ పేపర్స్ కు ఫీజు లింక్
ఆన్లైన్ క్లాసులంటూ అధిక ఫీజులు వసూలు చేయొద్దని, ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం జీవో 46 లో స్పష్టంగా పేర్కొంది. అయినా ఏ ఒక్క స్కూల్ మేనేజ్ మెంట్ ఫాలో కావడం లేదు. ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో పేరెంట్స్ నుంచి ఇప్పటికే చాలా వరకు ఫీజులను స్కూల్స్ మేనేజ్ మెంట్లు మొదటి క్వార్టర్లీలోనే వసూలు చేశాయి. మరోసారి నయా దందా చేసేందుకు రెడీ అవగా పేరెంట్స్ఆందోళన చెందున్నారు. ఫీజు కట్టకుంటే మొన్నటి వరకు క్లాసులను కట్ చేసిన మేనేజ్ మెంట్ మొత్తం ఫీజుల వసూలకు ఇప్పుడు టెస్ట్ లను ఎంచుకున్నాయి. మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని ఆ క్వశ్చన్ పేపర్ ని ఒక సీల్డ్ కవర్ లో పెట్టి స్కూల్స్ కి పేరెంట్స్ ని పిలిపించుకుని వారికి అందిస్తున్నాయి. టీచర్ చెప్పినప్పుడే ఆ కవర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలని సూచిస్తున్నాయి. ఇలా సీల్డ్ కవర్ తీసుకెళ్లాలనుకుంటే డ్యూ ఫీజుని మొత్తం పే చేయాలని పేరెంట్స్ ని భయపెడుతున్నాయి.
ఏపీ ఇచ్చినట్లుగా.. ఇక్కడ లేకపోవడంతో..
ప్రభుత్వం జారీ చేసిన జీవో –46 పై క్లారిటీ లేదని పేరెంట్స్ అంటున్నారు. ఫీజులో ఎంత శాతం పే చేయాలో కూడా చెప్పలేదంటున్నారు. ఫీజు రిసిప్ట్ లో మొత్తం కాలమ్స్ ఫిల్ చేసి ఉంచి, పూర్తి ఫీజు కట్టాలని మేనేజ్ మెంట్ లు చెబుతున్నాయంటున్నారు. ఏపీలో 30 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారని, ఇక్కడ అలాంటిదేమీ లేక ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు లేకుండా పోయిందంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో జాబ్‌లు పోయి, బిజినెస్‌లు లాస్అయి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న టైం లో స్కూల్స్ ఫీజులపై ఒత్తిడి తెస్తుండడంతో మేనేజ్మెంట్లపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కంప్లయింట్ చేసినా నో రెస్పాన్స్
ప్రైవేట్ స్కూల్స్ దోపిడీపై చాలా మంది పేరెంట్స్ డీఈఓకు కంప్లయింట్ చేస్తున్నా రెస్పాన్స్ లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఎవరికీ చెప్పుకోవాలని పేరెంట్స్ప్రశ్నిస్తున్నారు. ఫీజు వసూళ్లను నియంత్రించే విషయంలో సర్కార్పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ కు వెళ్లి అడిగితే ఇష్టమైతే ఉండండి లేదంటే, స్కూల్ మానిపించమని చెబుతున్నారని వాపోతున్నారు.
మొత్తం ఫీజు కట్టాలని ఒత్తిడి
కరోనా ఎఫెక్ట్ తో జాబ్ పోయింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ టైమ్ లో ఫీజు మొత్తం కట్టాలంటూ స్కూల్ మేనేజ్మెంట్ఒత్తిడి చేస్తుంది. పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా మొత్తం ఫీజు కట్టమనడం దారుణం. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పరిష్కారం చూపాలి.
– మణి, పేరెంట్, బోయిన్ పల్లి
జీవో 46 ఎందుకిచ్చారో
గతేడాది నెలకు రూ.3, 200 ఫీజు కట్టాను. ఇప్పుడు రూ.3, 250 పే చేయమంటున్నారు. డీఈవోకు కాల్ చేస్తే ట్యూషన్ ఫీజు మాత్రమే ఇవ్వమని చెబుతున్నారు. స్కూల్ మేనేజ్ మెంట్ మాత్రం మొత్తం కట్టా ల్సిందేనని చెబుతోంది. జీవో 46 అసలు ఎందుకు రిలీజ్ చేశారో అర్థంకావటం లేదు.
– రవీందర్, పేరెంట్, హిమాయత్ నగర్
మేనేజ్మెంట్లు ఇబ్బంది పెడితే చెప్పాలి
ఆన్లైన్క్లాసులు, ఫీజులపై చాలామంది పేరెంట్స్ కంప్లయింట్ చేస్తున్నారు. డీటెయిల్డ్ గా స్కూల్ నేమ్ తో సహా చెప్తే డిప్యూటీ డీఈఓని పంపిస్తున్నాం. స్కూల్స్ అన్ని ఫీజుల ను ట్యూషన్ ఫీజులో కలిపి కట్టమంటే 2019 లో ఎంత కట్టారో అంతే పే చేయండి. స్కూల్స్ మేనేజ్ మెంట్లు ఇబ్బంది పెడితే మాకు చెప్పండి. యాక్షన్ తీసుకుంటాం.
‑ రోహిణి, డీఈఓ, హైదరాబాద్ జిల్లా
For More News..