
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2013, జనవరి 3న కొత్త సైన్స్ విధానం సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాస్త్ర సాంకేతిక నవీకరణ విధానాన్ని 2013లో కోల్‌కతాలో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో విడుదల చేశారు.
లక్ష్యాలు:
- సమాజంలోని అన్నివర్గాల్లో జ్ఞాన తృష్ణను పెంచడం
- అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువతలో శాస్త్ర సాంకేతిక రంగాల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం
- నైపుణ్యం ఉన్న యువతను విజ్ఞాన పరిశోధన, నవీకరణ వైపు ఆకర్షించి వారి కెరీర్‌ను తీర్చిదిద్దడం
- విజ్ఞాన రంగాల్లో పరిశోధనాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం
- 2020 నాటికి ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాల్లో తొలి ఐదింటి శక్తి సాధిత దేశాల్లో భారత్‌ను నిలబెట్టడం. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 3.5శాతం నుంచి 7శాతానికి అంతర్జాతీయ విజ్ఞాన ప్రచురణ సాధించడం
- దేశ జీడీపీలో పరిశోధనా అభివృద్ధి వ్యయాన్ని ప్రస్తుతం ఉన్న 1శాతం నుంచి 2శాతానికి తగ్గించడం
- ప్రైవేటురంగంలో పరిశోధనా అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించే అనుకూల వాతావరణాన్ని కల్పించడం
- వచ్చే ఐదేండ్లల్లో దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలను 66శాతానికి పెంచడం
- పరిశోధనాభివృద్ధి కార్యక్రమాల్లో మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం
- మేధో సంపత్త హక్కుల రంగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడం