ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ మేజర్ సబ్జెక్ట్. మన జీవన విధానంలో విప్లవాత్మక మార్పులకు కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ. దానిపైనే ప్రస్తుత మానవ జీవితం ఆధారపడి ఉంది. కమ్యూనికేషన్, హెల్త్ టెక్నాలజీ.. చివరికి డబ్బు సంపాదన కూడా టెక్నాలజీపై అవసరం. సైన్స్ అండ్ టెక్నాలజీ మన జీవన విధానంలో ఒక భాగమైంది. అందుకే దానిపై అభ్యర్థులకు సరైన, లోతైన అవగాహన ఉండాలి. అధికారులుగా ఎంపికైన తర్వాత ఏ రకంగా ప్రజలకు సేవ చేయగలుగుతారు? అనేది దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి పోటీ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం.
గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఒక్కటే ఉంటుంది. బయో టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఇలా ఏ టాపిక్ తీసుకున్నా మొదట సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఉదాహరణకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని తీసుకుంటే.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అంటే ఏమిటి? దాని వెనకున్న ప్రధానాంశాలు తెలిస్తేనే ప్రిలిమ్స్‌లో క్వశ్చన్ ఏ రకంగా అడిగినా సమాధానం గుర్తించవచ్చు. మెయిన్స్‌లో క్వశ్చన్ అడిగినా డిస్క్రిప్టివ్ రాయొచ్చు. అంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్‌పై క్లారిటీ ఉంటే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింట్లోనూ జవాబులు రాయొచ్చు. అలాకాకుండా మెటీరియల్‌గా ఇచ్చే బుక్స్‌లో పాయింట్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ బేస్డ్‌గా అంశాలు ఉంటాయి. అవి చదివితే ప్రిలిమ్స్‌లో ఆన్సర్ గుర్తించలేం. అందుకే, కాన్సెప్ట్, ఇన్ఫర్మేషన్ రెండూ తెలుసుకోవాలి. ప్రిలిమ్స్‌లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. మెయిన్స్‌లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని డివైడ్ చేసుకొని చదవాలి.
సిలబస్ నేర్పుతుంది
ఎలా ప్రిపేర్ కావాలో సిలబస్ నేర్పిస్తుంది. సిలబస్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రిపరేషన్ గాడి తప్పుతుంది. కాబట్టి సిలబస్‌ను అర్థం చేసుకోవాలి. సిలబస్ ఏమిటి? దాని పరిధి ఏమిటి? తెలుసుకోవడమే ప్రిపరేషన్‌లో తొలి అడుగు. దాన్ని విస్మరిస్తే ప్రిపరేషన్‌లో వెనుకబడినట్టే. గ్రూప్-1 పేపర్-5 సెక్షన్-1లో అర్బనైజేషన్ అనే పదం ఉంది. స్మార్ట్ సిటీస్ మిషన్ చదువుతున్నాం అంటే ఎక్కడ ఈ క్వశ్చన్ రావొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఎస్సే, ఎకానమీ ఎక్కడైనా ప్రశ్న అడగవచ్చు. ఇది మనకు తెలియాలి. అందుకే సిలబస్ స్కోప్ తెలుసుకోవాలి. ఒక్క పేపర్‌లోని యూనిట్స్ మధ్య వేర్వేరు పేపర్ల మధ్య కో-ఆర్డినేషన్ చాలా అవసరం.
స్కోప్ పెంచుకోవాలి
సిలబస్‌లో ఇచ్చింది మాత్రమే చదవడం కాదు. స్కోప్ పెంచుకోవాలి. ఉదాహరణకు ‘ప్రపంచ పర్యావరణ సవాళ్లు’ అనే అంశం తీసుకుంటే ఇందులోకి ఏయే అంశాలు వస్తాయి అనేది ముఖ్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య శీతోష్ణస్థితి మార్పులు.
ఇందుకు ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. పర్యావరణ కాలుష్యంలో గాలి, జల వాయు, శబ్ద, కాంతి కాలుష్యాలు వస్తాయి. ఈరోజు పెద్ద సమస్య ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ. అందులో ఎలక్ట్రాన్, బయోమెడికల్, రేడియో యాక్టివ్ వేస్ట్ వస్తాయి. ఆమ్ల వర్షాలు, బయోడైవర్సిటీ లాస్, ఎడారీకరణ. ఈ మధ్యకాలంలో మానవుడు కాంతి కాలుష్యానికి ఎక్కువగా గురవుతున్నాడు. దీని గురించి చాలా మంది చదివి ఉండరు. కానీ, ఎగ్జామ్‌లో ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
ఏది మొదట చదవాలి
మెయిన్స్ బేస్డ్‌గా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ తేలిక ఉంటుంది. ఉదాహరణకు పేపర్-5 ఎస్అండ్టీలో సెక్షన్-1లో స్పేస్ ప్రోగ్రామ్ అనే అంశం ఉంది. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ చరిత్ర, ప్రస్తుత కార్యక్రమాలు, ఉపగ్రహాల ప్రయోగం, ఇన్‌శాట్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, చంద్రయాన్-1, చంద్రయాన్-2, మంగళయాన్, ఆస్ట్రోశాట్, చంద్రయాన్-3, గగన్‌యాన్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కచ్చితంగా చదవాలి. ఇంటర్నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్‌పై కూడా ప్రశ్నలు వస్తాయి. గత ఏడాది డిసెంబర్‌లో నాసా ఒక ప్రత్యేక స్పేస్ క్రాప్ట్‌ను ల్యాంచ్ చేసింది. స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ఏ సంస్థకు సంబంధించింది. రాస్‌కాస్మస్ స్పేస్ ఏజెన్సీ ఏ దేశానికి చెందింది. ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు.
బేసిక్స్ నుంచే నేర్చుకోవాలి
కేవలం జీకే మోడ్‌లో చదవకూడాదు. బేసిక్స్ నుంచి చదవాలి. 20 నుంచి 30శాతం ప్రశ్నలు అభ్యర్థిని ఇబ్బంది పెట్టే రీతిలో ఉంటాయి. ఉదాహరణకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది.
1. ఎగరని పక్షుల నుంచి ఎగిరే పక్షులు ఆవిర్భవించాయి.
2. తేళ్లు, సాలీడ్లు అనేవి కీటకాలు కాదు
సరైన జవాబు ఏది?
ఎ. 1 మాత్రమే
బి. 2 మాత్రమే
సి. 1, 2 సరైనవి
డి. 1, 2 సరికావు
జవాబు: బి
అభ్యర్థికి సబ్జెక్ట్‌పై పట్టుందా? అనే దానిని పరీక్షిస్తారు. బేసిక్స్, కరెంట్ ఎఫైర్స్ కలిపి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. నాకు కరెంట్ ఎఫైర్స్ మాత్రమే తెలుసు, బేసిక్స్ తెలియవు అంటే సమాధానం గుర్తించడం ఇబ్బంది అవుతుంది. క్వశ్చన్‌ను ఎలా అడుగుతారు? ఎలా అడిగే అవకాశం ఉందని తెలుసుకొని ప్రిపేర్ కావాలి. పైపైన ప్రిపేరైతే గ్రూప్-1 ప్రిలిమ్స్క్లియర్ చేయడం కష్టం అవుతుంది.
యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ఆన్ క్లైమెట్ చేంజ్(యూఎన్ఎఫ్సీసీసీ) కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్– 26(సీఓపీ) గత సంవత్సరం గ్లాస్గోలో జరిగింది. ఈ ఏడాది ఈజిప్టులోని షమ్ ఎల్ షేక్‌లో జరగనున్నది. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్‌కు అవసరమైంది ఇదే. ఈరోజు, నిన్న, రేపు ఏం జరుగుతున్నాయి? ఏం జరిగాయి అనే దానిపై అత్యధిక ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ లో కరెంట్ బేస్డ్ ప్రశ్నలు అడగడం ఇప్పుడు సాధారణ విషయం. ఎగ్జామ్ డేట్ కంటే ముందు సంవత్సరం వరకు సబ్జెక్ట్‌లో ఏయే డెవలప్‌మెంట్లు వస్తున్నాయనేది తెలుసుకోవాలి. 2022 మే 9 నుంచి 20 వరకు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ)కి సంబంధించిన కాప్-15 సదస్సు పశ్చిమ ఆఫ్రికా దేశమైన కాట్ డి ఐవరీలోని అబుజాన్ నగరంలో జరిగింది. ఇది గ్రూప్-1 పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఓ ప్రశ్న చూద్దాం.
ఎడారీకరణ అడ్డుకోవడానికి జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి?
జవాబు: యూఎన్‌సీసీడీ