ఓయూ, వెలుగు: ప్రస్తుత సమాజంలో విజ్ఞాన విప్లవం ప్రపంచాన్ని శాసిస్తోందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్టారెడ్డి అన్నారు. ‘ఆధునిక మేధో విజ్ఞానం భారతీయ జ్ఞాన వ్యవస్థల మూలాలు, పునరుద్ధరణ’ అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జీ. రాంరెడ్డి దూరవిద్యా కేంద్ర ఆడిటోరియంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసిన మూడు రోజుల జాతీయ సదస్సుకు ఆయన మఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికత అనే పదం కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. భారతీయ మూలాల్లోనే ఉందని గుర్తు చేశారు. దేశంలో నేటికీ అనేక సమస్యలు ఉన్నాయన్నారు.ఈ ప్రోగ్రాంకు అధ్యక్షత వహించిన ఓయూ వీసీ ప్రొఫెసర్కుమార్ సాంకేతికత భవిష్యత్తు విద్యా విధానాన్ని సమూలంగా మార్చేస్తుందన్నారు. కార్యక్రమంలో అఖిల భారతీయ రాష్ట్రీయ షైక్షిక్ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి, గుంతా లక్ష్మణ్ , శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాణి సదాశివ మూర్తి,విద్యాభారతి శిక్షా సంస్థాన్ ఉపాధ్యక్షుడు మురళీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.