మరో రెండు రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానుండగా, తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ కప్ గెలిచే జట్టు ఏదన్న దానిపై జ్యోతిష్యం చెప్పే వారి సంఖ్య పెరిపోతోంది. ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలూ వెల్లడించగా.. తాజాగా ఓ ప్రముఖ జ్యోతిష్యుడు సరికొత్త లెక్కలు బయటపెట్టాడు.
'1987..'
సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ గ్రీన్‌స్టోన్ లోబో అంచనా ప్రకారం.. 1987వలో జన్మించి.. ఇప్పుడు ఓ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి 2023 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుస్తాడట. అందుకు ఉదాహరణలుగా 1986, 1987లో జన్మించిన ప్లేయర్లు, క్రీడా జట్లకు నాయకులుగా ఉండి సాధించిన విజయాలను ప్రస్తావించాడు. ఈ ఉదాహరణల్లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరు కూడా ఉండటం గమనార్హం. 1986లో జన్మించిన ఇయాన్ మోర్గాన్ 2019 వరల్డ్ కప్ లో ఆ జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతిష్య లెక్కల ప్రకారం.. 2023 ప్రపంచ కప్ ను 1987లో జన్మించిన వ్యక్తి కప్ గెలవనున్నాడట.
షకీబ్, రోహిత్
లోబో లెక్కల ప్రకారం చూస్తే.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(మార్చి 24), టీమిండియా సారథి రోహిత్ శర్మ(ఏప్రిల్ 30)1987లో జన్మించారు. అంటే ఈ రెండు జట్లలో ఒకటి విశ్వ విజేతగా నిలవాలి. కానీ, బంగ్లా జట్టును చూస్తే.. సెమీస్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత గొప్పగా ఉంది. ఈ లెక్కన ఇండియా గెలవబోతోందన్నమాట. ఈ జ్యోతిష్యం లెక్కలు కాకపోయినా.. సొంతగడ్డపై ఆడుతుండటం భారత జట్టుకు కలిసొచ్చేదే.ఈ మెగా టోర్నీలో భారత జట్టు.. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
Famous astrologer Greenstone Lobo has predicted that India will win World Cup 2023 ???
— Sportskeeda (@Sportskeeda) October 2, 2023
He says India have the best captain in Rohit Sharma and his story is following the same pattern to that of Lionel Messi.
Greenstone Lobo, previously, predicted correctly the winners of… pic.twitter.com/hm9DtstNDZ