- క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీసులదే కీ రోల్
- బాధితులకు న్యాయం చేయడమే అంతిమ లక్ష్యం
- డీజీపీ జితేందర్
- రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభం
హైదరాబాద్: క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీసులదే కీలకపాత్ర అని డీజీపీ జితేందర్ అన్నారు. విధుల్లో ప్రొఫెషనల్ గా వ్యవహరించాలని సూచించారు. చాలెంజింగ్ కేసులను కూడా సైంటిఫిక్ ఆధారాల ద్వారా ఛేదించాలన్నారు. రాజేంద్రనగర్ లోని పోలీసు అకాడమీలో ఇవాళ్టి నుంచి4 రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను డీజీపీ జితేందర్ ప్రారంభించారు. వివిధ జిల్లాలకు చెందిన 400 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా సైంటిఫిక్ఇన్వెస్టిగేషన్, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్అవగాహనపై పోటీలు నిర్వహించారు.
ALSO READ | బకాయిలు పెట్టి.. బుకాయింపులా..? కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
కేసుల ఛేదన, ఆధారాల సేకరణపై ఉన్నతాధికారులు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ‘పోలీసుల అంతిమ లక్ష్యం బాధితులకు న్యాయం చేకూర్చడమే. అందుకే పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా కేసులు చేర్చడంలో ప్రావీణ్యం సంపాదించాలి. సమాజ సేవలో పోలీసులు శక్తి వంచన లేకుండా పనిచేయాలి’ అని సూచించారు. అదనపు డీజీ సీఐడీ శిఖా గోయల్ మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడానికి పోలీసులు కొత్తకొత్త విధానాలను నేర్చుకోవాలన్నారు. డ్యూటీ మీట్లో నేర్చుకున్న మెలకువలతో జార్ఖండ్ లో జరగబోయే నేషనల్ లెవెల్ పోలీస్ మీట్ లో సత్తా చాటాలని సూచించారు.