మగవారికి మొలతాడు ఎందుకు కడతారు.. ఆధ్యాత్మికమా.. సైన్సా..

మగవారికి మొలతాడు ఎందుకు కడతారు.. ఆధ్యాత్మికమా.. సైన్సా..

హిందూ సాంప్రదాయం (Hindu Traditions) లో మొలతాడు అనేది చాలా ప్రత్యేకమైనది. సమాజంలో కొన్ని ఆచారాలు ఎందుకు వచ్చాయో...ఎందుకు ఆచరించాలో చాలా మందికి తెలియదు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు నడుముకు మొలతాడు ధరిస్తారు. అమ్మ చెప్పింది....నాన్నమ్మ  కట్టుకోమని చెప్పిందని కట్టేసుకుంటారు. అసలు మొలతాడు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. మొలతాడు ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా సైన్స్ దాగి ఉందంటే అవుననే అంటున్నారు.  కొంద‌రికి మొల‌తాడు ధ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలియ‌కున్నా ఆచారం కాబ‌ట్టి క‌ట్టుకుంటారు. మొల‌తాడు ధ‌రించ‌డం ద్వారా ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ ప‌రంగా కూడా ఎలాంటి  ప్రయోజనాలు క‌లుతాయో తెలుసుకుందాం. . 

 మగవాళ్లు అందరు మొలతాడు కట్టుకుంటారు కానీ చాలా మందికి అది ఎందుకు కట్టుకుంటారో తెలియదు. సాధార‌ణంగా చిన్నత‌నంలో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్రతి ఒక్కరు త‌మ పిల్లల‌కు మొల‌తాడును క‌డ‌తారు. వ‌య‌స్సు పెరిగే కొద్దీ కేవ‌లం మ‌గ‌వారు మాత్రమే దాన్ని ధ‌రిస్తారు. మొలత్రాడు, పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం . ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. ఇప్పుడు చాలా మంది ఫ్యాష‌న్‌కు పోయి మొల‌తాడ‌ను ధ‌రించ‌డం లేదు. అయితే, మొల‌తాడు క‌ట్టుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌ని, దాన్ని త‌ప్పకుండా ధ‌రించాల‌ని పెద్దలు చెబుతూ ఉంటారు..

  •  హిందూ ధర్మంలో…. మొలతాడును పవిత్రమైన దారంగా భావిస్తారు. ఇది శివునితో సంబంధం కలిగి ఉంది .   దీనిని ధరించడం వల్ల పురుషులకు శక్తి, సంతానోత్పత్తి .. అంతా శుభమే జరుగుతుందని  నమ్ముతారు.
  • మొలతాడు అనేది అలంకారానికి సంబంధించిన వస్తువు కాదు. దీని వ‌ల్ల దుష్టశ‌క్తుల ప్రభావం ఉండ‌దని పండితులు చెబుతుంటారు.
  • దిష్టి తగలకూడదని మొలతాడు కడతారు. చిన్నపిల్లలకు నల్లటి మొలతాడుతో పాటూ రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం కూడా ఇదే.
  •  జైన ధర్మంలో…. మొలతాడును జనేవు అని పిలుస్తారు మరియు ఇది స్వచ్ఛత మరియు ఆధ్యాత్మికత యొక్క చిహ్నం.
  •  సిక్కు ధర్మంలో….. కేశాలు కత్తిరించుకోకుండా ఉండే పురుషులు కెస్ ధరిస్తారు, దీనితో పాటు కంకణ్ అనే మొలతాడు కూడా ధరిస్తారు.
  • కొంద‌రికి జాత‌క రీత్యా ఉండే దోషం తగ్గేందుకు కూడా  తాయెత్తులు మొలతాడుకు కట్టేవారు
  • నల్లటి తాడుని మొలకి కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారు
  •  కొన్ని సంస్కృతులలో, మొలతాడును పురుషులకు పురుషత్వం యొక్క చిహ్నంగా భావిస్తారు.
  • కొంతమంది మొలతాడు ధరించడం వల్ల గ్రహ దోషాల నుండి రక్షణ కలుగుతుందని నమ్ముతారు.
  • శరీరాన్ని మధ్యగా బాహ్యరూపంలో విభజించి చూపిస్తుంది. మొలతాడు కట్టిన పై భాగం అలంకారం, పూజా పునస్కారాలకు సంబంధించినది అని చెప్పడమే అంతరార్ధం
  • చిన్నపిల్లలకు మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు ,కండరాలు సరియైన పద్ధతిలో వృద్ధిచెందుతాయి.  రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 
  • చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా కట్టినా పెద్దవారైన తర్వాత కేవలం పురుషులు మాత్రమే మొలతాడు వినియోగిస్తారు
  • పెళ్లైన స్త్రీకి మెడలో మంగళసూత్రం  ఎంత ముఖ్యమో... పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం. అందుకే అప్పట్లో మొలతాడు లేని పురుషులను...భార్య చనిపోయిందా అని అడిగేవారట...
  • ఇప్పుడంటే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్ కి వెళుతున్నాం కానీ అప్పట్లో చుట్టుపక్కల లభించే ఆకులు, వేర్లనే వైద్యానికి వినియోగించేవారు. ముఖ్యంగా విష పురుగులు ఏవైనా కుట్టినప్పుడు వెంటనే మొలతాడు గట్టిగా బిగించి విషం పైకి ఎక్కకుండా చేసి బయటకు తీసేవారు
  • మొల‌తాడును ధ‌రించ‌డం వ‌ల్ల మనం తినే ఆహారంపై కంట్రోల్ ఉంటుంది. కాస్త ఎక్కువ తిన్నాసరే... మొలతాడు బిగుసుకుపోతుంది. అంటే మనం తినాల్సినదానింటే ఎక్కువ తిన్నామని అర్థమవుతుంది. బిగుసుకుపోతున్న మొలతాడు కారణంగా పొట్ట పెరుగుతుందని సంకేతాలు ఇస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు. ఇలా బ‌రువు అదుపులో ఉంటుంది, జీర్ణక్రియ మెరుగు ప‌డుతుంది, బానపొట్టని నివారిస్తుంది. 
  • మొల‌తాడు ధరించేవారికి హెర్నియా రాదని చెబుతారు. పైగా వెన్నుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మొలతాడు కట్టుకోవడం మంచిదంటారు 
  •  చిన్న పిల్లల మొలతాడుకి తాయెత్తులు కట్టేవారు.  ఆ తాయెత్తులో బొడ్డుతాడు మూలకణాలు పెట్టి వాటికి పసరు మందులు పూసి కట్టేవారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం.  ఎన్నో వ్యాధులకు బొడ్డు మూలకణాలు సొల్యూషన్. ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెర‌పీలా. అందుకే బొడ్డుతో తాయెత్తు చేసి..ఇప్పుడు కొందరు బొడ్డు మువ్వ అంటున్నారు. దాన్ని మొలతాడుకి కడుతున్నారు.  
  • ఇలా హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం, పద్ధతి వెనుకా శాస్త్రీయకారణాలు ఉంటాయనేందుకు ఇదే నిదర్శనం అంటారు పండితులు.