ఇది నిజమా : ఆకలిగా ఉన్నప్పుడు.. సీరియస్ విషయాలపై నిర్ణయాలు తీసుకోవద్దు.. ఎందుకంటే..?

ఇది నిజమా : ఆకలిగా ఉన్నప్పుడు.. సీరియస్ విషయాలపై నిర్ణయాలు తీసుకోవద్దు.. ఎందుకంటే..?

మన మానసిక స్థితి మన నిర్ణయాలపై ప్రభావం చూపుతుందన్నది చాలా సందర్భాల్లో వింటుంటాం.. అలాగే ఆకలితో ఉన్నప్పుడు ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోకూడదని ఇటీవల ఓ స్టడీలో తేలింది. స్కాట్లాండ్ లోని దండీకి చెందిన 'యూనివర్సిటీ ఆఫ్ దండీ'రీసెర్చర్స్ చేసిన స్టడీలో తేలిన విషయమిది. యూనివర్సిటీలో సైకాలజీ విభాగంలోపని చేస్తున్న డాక్టర్ బెంజమిన్ విన్సెంట్ ఆధ్వర్యంలోని సైంటిస్టులు కొంతమందిపై ఈ స్టడీని నిర్వహించారు. ఒక నిర్ణయం తీసుకునే విషయంలో ఆకలి ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సైంటిస్టు లు స్టడీ నిర్వహించారు.

ఆకలితో ఉన్నప్పుడు, ఆకలి లేనప్పుడు... రెండు సందర్భాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని సైంటిస్టులు పరి శోధించారు. డబ్బు. ఫుడ్, రివార్డ్ వంటి కొన్ని అంశాలపై అధ్యయనంలో పాల్గొన్న వాళ్లను ప్రశ్నలు అడిగారు. ఈ స్టడీలో ఆకలితో ఉన్న వాళ్లు సరైన సమాధానాలు చెప్పలేకపోయినట్లు, సరిగ్గా ఆలోచించలేకపోయినట్లు సైంటిస్టులు గుర్తించారు.

Also Read :- తినేది ఆహారమా.. విషమా

ఆకలితో ఉన్నప్పుడు డబ్బు, ఇతర అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయినట్లు తేలిందని డా.బెంజమిన్ తెలిపారు. నిర్ణయాలు తీసుకునే విషయాన్ని ఆకలి ప్రభావితం చేస్తుందని, ఈ సమయంలో లాంగ్ టర్మ్ డెసిషన్స్ కంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉండే డెసిషన్సే ఎక్కువగా తీసుకుంటున్నారని బెంజమిన్ చెప్పాడు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆకలి లేకుండా చూసుకోవా లని సూచించారు.