
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో 65 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 28 సంవత్సరాలు మించకూడదు.
సెలెక్షన్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు మే 24 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వివరాలకు www.isro.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.