పక్షి ఆకారంలో మాస్క్.. అతని లక్ష్యం నెరవేరిందా లేదా..?

శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు.  కొన్నిటి ఫలితాలు తొందరగా వస్తే...మరికొన్ని ఫలితాల రిజల్ట్ రావాలంటే సంవత్సరాలకు సంవత్సరాలు పడుతుంది.  శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు.  ఇప్పుడు టోక్యో విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ తోషిటకా  సుజుకి తన ట్విట్టర్ లో తోటి ఉద్యోగస్థుని ఫోటోను పోస్ట్ చేశారు.  ఆ ఫొటోలో ఉన్న ఫ్రొఫెసర్ ఓ పక్షి మాస్క్ ను ఏడాది పాటు  ధరించి ... పక్షుల  గొంతుపై పరిశోధన చేశాడని తెలిపారు.  

ప్రపంచంలో అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు.   కొంతమంది ప్రయోగాలు చేసేందుకు నెలల తరబడి ఒకే గదిలో ఉంటారు.  తిండి, నిద్ర గురించి కూడా ఆలోచించరు.  తాజాగా జపాన్ కు చెందిన శాస్త్రవేత్త పక్షుల తల గురించి చేసిన పరిశోధనపై  ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.  ఆ సైంటిస్ట్ ఏడాది పాటు బర్డ్ మాస్క్ ధరించాడు.  ఈ ఫొటోను ఆ ప్రొఫెసర్ తోటి ఉద్యోగి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.


ప్రొఫెసర్ టిట్స్ పక్షిపై పరిశోధనలు చేస్తున్నాడని జపాన్ లోని టోక్యో యూనివర్శిటి  ప్రొఫెసర్ సుజుకి ( తన సహోద్యోగి)  చెప్పారు. ఆయన పక్షులతో  స్నేహం చేయడానికి అచ్చం బర్డ్ మాదిరిగా తన మొహం ఉండేలా  పక్షి ముసుగు ధరించి అడవులకు వెళ్లారు.  అతను ఒక సంవత్సరం   పక్షి ముసుగు ధరించాడు.  మనుషుల ముఖాలను కనిపెట్టే  అనేక రకాల పక్షులు ఉన్నాయని శాస్త్రవేత్త గమనించారు .  ఆ ఫ్రొఫెసర్ పక్షుల మాదిరిగా శబ్దాలు చేయడం.. పక్షి ముసుగులో వాటి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. 

Also Read :- పట్టపగలే..అందరూ చూస్తుండగానే.. మహిళ మెడలోంచి గోల్డ్చైన్ లాక్కెళ్లారు

ప్రొఫెసర్ పక్షుల స్వరాన్ని అధ్యయనం చేసేందుకు పక్షుల గూళ్లకు వెళ్లే వారని ఒక నివేదికలో పేర్కొన్నారు.   పక్షి ముసుగుతో వాటి దగ్గరకు వెళ్లినప్పుడు వింత వింత శబ్దాలు చేసేవని తెలిపారు. భయంతో అరిచే గొంతు మాదిరిగా వాటి స్వరం ఉండినట్లు గుర్తించనట్లు తెలిపారు,   అయితే పక్షి తన ముఖాన్ని గుర్తించి అక్కడి వెళ్లడంతో తన సహోద్యోగి చేసిన ప్రయోగం విఫలమైందని ప్రొఫెసర్ సుజుకి చెప్పారు.  ఏది ఏమైనా ఏడాది పాటు పక్షి మాస్క్ ధరించి అడవుల్లో ప్రొఫెసర్ పక్షుల గొంతుపై ప్రయోగాలు చేయడం చాలా గొప్పవిషయమని ఆ ప్రొఫెసర్ ను అభినందిస్తున్నారు.