ఇదెక్కడి విడ్డూరం.. ఉప్పు, నీళ్లతో ఆర్టిఫిషియల్ బ్రెయిన్ తయారీ

ఇదెక్కడి విడ్డూరం.. ఉప్పు, నీళ్లతో ఆర్టిఫిషియల్ బ్రెయిన్ తయారీ

మనిషి మెదడు మరో మెదడుని తయారు చేస్తోంది. వినడానికి.. నమ్మడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా జరిగింది ఇదే.. నెదర్లాండ్స్‌లోని ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయం, దక్షిణ కొరియాలోని సోగాంగ్ విశ్వవిద్యాలయం కలిసి ఓ కృతిమ మెదడుని తయారు చేశాయి. ఈ రీసెర్చ్ ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. 

ఈ ఆర్టిఫీషియల్ బ్రెయిన్ తయారీలో నీరు, ఉప్పును వాడారంట.. సినాప్సెస్ అని పిలువబడే కృత్రిమ నరాల జంక్షన్‌ను  సృష్టించి దానికి అయోంట్రానిక్ మెమ్రిస్టర్ పేరు పెట్టారు. ఇది కోన్ షేప్ లో ఉండి.. మనిషి 4 వెంట్రుకల మందం (150- 200 మైక్రోమీటర్ల వెడల్పు) పరిమాణంలో ఉంటుంది. మెదడు సమాచారాన్ని చేరవేసే అతిముఖ్యమైన కణాలే సినాప్సెస్.. వీటితోనే హూమన్ బ్రెయిన్ నిర్మాణమై ఉంటుంది.