ఈ బ్యాటరీ వేడెక్కదు.. పేలిపోదు

ఈ బ్యాటరీ వేడెక్కదు.. పేలిపోదు
  • ఫోన్ పగిలినా, నీళ్లలో పడినా ఏమీ కాదు 
  • కొత్త లిథియం అయాన్ బ్యాటరీని తయారు చేసిన అమెరికా రీసెర్చర్లు
  • మరో ఏడాదిలో అందుబాటులోకి వచ్చే చాన్స్ 

మూడేండ్ల కిందట.. యాపిల్ ఐఫోన్‌‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మార్కెట్లోకి రిలీజ్ అయింది. కానీ శాంసంగ్ ఫోన్లు వరుసగా పేలడం మొదలుపెట్టాయి. తయారు చేసేటప్పుడు జరిగిన లోపం వల్ల బ్యాటరీలు వేడెక్కి, పేలిపోతున్నాయని తేలడంతో ఆ కంపెనీ పెద్ద మొత్తంలో నష్టాన్ని భరించి మరీ తన గెలాక్సీ నోట్ 7 ఫోన్లన్నింటినీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ ఫెయిల్యూర్‌‌పై ఫోకస్ పెట్టిన కంపెనీ తాజాగా.. ఒక సరికొత్త పవర్ ఫుల్ బ్యాటరీని తయారు చేసినట్లు ప్రకటించింది.

‘‘ఈ కొత్త బ్యాటరీ వాతావరణంలో టెంపరేచర్లు పెరిగినా విపరీతంగా వేడెక్కదు. ఫోన్లు కింద పడి పగిలిపోయినా, నీళ్లలో పడినా బ్యాటరీకి ఏమీ కాదు. ఒకవేళ బ్యాటరీ దెబ్బతిన్నా కూడా అస్సలు పేలిపోదు” అని ఆ కంపెనీ వెల్లడించింది.  ప్రస్తుతం దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ లిథియం అయాన్ బ్యాటరీలనే వాడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఓవర్ హీటింగ్, ప్రెజర్, లోపాల కారణంగా ఈ బ్యాటరీలు పేలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ కంపెనీ కొత్త బ్యాటరీని డెవలప్ చేసే పనిని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబోరేటరీ రీసెర్చర్లకు అప్పగించింది. కొత్త లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో తాము సక్సెస్ అయ్యామని, మరో ఏడాదిలోపే ఈ బ్యాటరీని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని వారు వెల్లడించారు.

పేలిపోయేందుకు చాన్సే లేదు.. 

ప్రస్తుత లిథియం అయాన్ బ్యాటరీలలో వాడుతున్న లిక్విడ్ ఎలక్ట్రోలైట్లు స్మార్ట్ ఫోన్లకు బ్యాటరీ పవర్ ఇవ్వడంలో చాలా బాగా పనిచేస్తున్నాయి. కానీ, ఇవి కొంచెం వేడి, ప్రెజర్ పెరగగానే పేలిపోయే ప్రమాదం కూడా ఎక్కువే ఉంది. అందుకే.. కొత్త లిథియం అయాన్ బ్యాటరీల్లో ‘వాటర్ ఇన్ సాల్ట్’, ‘వాటర్ ఇన్ బైసాల్ట్’ ఎలక్ట్రోడ్‌‌లను వాడారు. వీటిని పాలిమర్ పొరల మధ్య ఉంచడంతో వాటర్ యాక్టివిటీ తగ్గిపోయి ఎనర్జీ కెపాసిటీ బాగా పెరిగింది. ఈ ఎలక్ట్రోడ్‌‌లలో మండే స్వభావం ఉండే కెమికల్స్ ను కూడా తొలగించడంతో ఇవి పేలిపోయేందుకు చాన్సే ఉండదని చెబుతున్నారు.

Read more

Scientists develop incombustible lithium-ion battery for Samsung Note 7