కిసాన్​ కవచ్​: ఇండియా నుండి తొలి యాంటీ పెస్టిసైడ్​ బాడీసూట్​

కిసాన్​ కవచ్​: ఇండియా నుండి తొలి యాంటీ పెస్టిసైడ్​ బాడీసూట్​

స్వదేశీ తొలి యాంటీ పెస్టిసైడ్​ బాడీసూట్​ కిసాన్​ కవచ్​ను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్​ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. కొంత మంది రైతులకు కిసాన్​ కవచ్​ మొదటి బ్యాచ్​ దుస్తులను పంపిణీ చేశారు.పంటలకు పురుగుల మందులను వినియోగించేటప్పుడు హానికారక రసాయనాల ప్రభావానికి గురికాకుండా రైతులకు కిసాన్​ కవచ్​ దుస్తులు రక్షణ కల్పిస్తాయి. తద్వారా రైతుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కిసాన్​ కవచ్​ కాపాడుతాయి. 

డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయోటెక్నాలజీ సహకారంతో బెంగళూరుకు చెందిన బ్రిక్​–ఇన్​స్టెమ్​, సిపియో హెల్త్​ ప్రైవేట్​ లిమిటెడ్​లు సంయుక్తంగా కిసాన్​ కవచ్​ను తయారుచేశాయి.కిసాన్​ కవచ్​ ధర రూ.4000. వీటిని ఏడాదిలో 150 సార్లు వాషింగ్​ చేసి వినియోగించుకోవచ్చు. దీని అత్యంత ఆధునాతన ఫ్యాబ్రిక్​ టెక్నాలజీ పురుగులమందుల ప్రభావాన్ని డీయాక్టివేట్​ చేస్తుంది.