కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం

కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం

కార్బన్ డయాక్సైడ్​తోపాటు పలు గ్రీన్​హౌస్​ వాయువులను శోషించుకొని కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధ్రువ అణువులు సమృద్ధిగా ఉండే ఈ పదార్థాన్ని కేజ్​ ఆఫ్​ కేజిస్​గా పిలుస్తున్నారు. ఇది కార్బన్​ డయాక్సైడ్​ తదితర గ్రీన్​హౌస్​ వాయువులను శోషించుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

ఇది నీటిలో మరింత స్థిరత్వంతో పని చేస్తుందని, తేమ, తడి వాయు ప్రవాహాల నుంచి సైతం ఇది కార్బన్​ డయాక్సైడ్​ను గ్రహిస్తుందన్నారు. పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడమే కాకుండా అత్యంత శక్తిమంతమైనదిగా గుర్తించిన సల్ఫర్​ హెక్సాఫ్లోరైడ్​(ఎస్​ఎఫ్​6)ను కూడా ఇది శోషించుకుటుందని పేర్కొన్నారు.