మీరు విన్నది నిజమే.. మనుషుల కిడ్నీలను పందుల పిండాల్లో పెంచుతున్నారు సైంటిస్టులు.. మానవ కణాలను కలిగి వున్న కిడ్నీలను పంది పిండాల్లో పెంచడం లో సక్సెస్ సాధించిన చైనా శాస్త్రవేత్తలు.అవయవ దానం కొరతను పరిష్కరించడంలో ఇది సాయ పడుతుందంటున్నారు.
గ్వాంగ్ జౌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో మెడిసిన్ అండ్ హెల్త్ కు చెందిన పరిశోధకులు మానవ మూత్ర పిండాల తయారీపై పరిశోధనలు చేశారు. ఇటీవల వారు పంది పిండాల్లో పెంచిన మూత్ర పిండాలను మనిషికి అమర్చి పరిశోధనలో విజయం సాధించారు.
పందుల్లో మానవ అవయవాలను పెంచడానికి గతంలో జరిగిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇటీవల పరిశోధనలతో మానవ కణాలు, పంది పిండాల్లో పెంపొందించడం ద్వారా పందులలో మానవ అవయవాలను పెంచడానికి అనువైనదని తేలింది.
పంది పిండాల్లో మానవ అవయవాలను పెంచడానికి పందులను ఇంక్యుబేటర్లుగా ఉపయోగించి ఆర్గాన్ బయో ఇంజనీరింగ్ కి కొత్త విధానంలో మార్గదర్శక దశలను ఈ పరిశోధన శోధించిందని లండన్ కు చెందిన స్టెమ్ సెల్ సైన్సెస్ ఫ్రొఫెసర్ డస్కో ఇలిక్ తెలిపారు.
పిండాలను పిండాలలో అమర్చడానికి ముందు, వారు వాటిని మానవ, పంది కణాలకు పోషణ చేసే పదార్థాలను కలిగి ఉన్న టెస్ట్ ట్యూబ్‌లలో పెంచారు. ఈ పరిశోధ నల్లో మొత్తంగా 1,820 పిండాలను 13 సర్రోగేట్ తల్లులుగా మార్చారు. ప్రయోగం ఎలా పని చేసిందో అంచనా వేయడానికి 25 నుంచి 28 రోజులలో గర్భాలను అబ్జర్వ్ చేశారు. వాటిలో 50 నుంచి 60 వాతం మానవ కణాలున్నట్టు గుర్తించారు.
విశ్లేషణ కోసం ఐదు పిండాలను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి దశలో క్రియాత్మకంగా సాధారణ మూత్రపిండాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. చివరికి వాటిని మూత్రాశయానికి అనుసంధానించే మూత్ర నాళాలు పెరగడం ప్రారంభించాయి.
ఏదైతేనేం.. అవయవ దానం కొరతను తీర్చేందుకు సైంటిస్టులు తమ పరిశోధనల్లో మరో ముందడుగు వేశారు.. ఇంకా మరింత అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలు జరుపుతున్నారు..