
తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భాస్కరుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలు దాటకముందే ఎండవేడిమి మొదలైంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. గాలిలో తేమ శాతం బాగా తక్కువగా ఉంటోంది. ఇళ్లలోంచి బయ టికి వచ్చేందుకు జనం భయపడిపోతున్నారు.. ఫిబ్రవరిలోనే ఇలా ఎండలుమండిపోతే.. ఇక మేనెల వచ్చేనాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చన ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రామగుండలో, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3డిగ్రీల పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం ఉదయం 11.30గంటలకు రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 32డిగ్రీలుగా నమోదు అయింది. రామగుండంలో24 , ఖమ్మంలో 24, ఆదిలాబాద్ 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంటినుంచి బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నారు.