AUS vs SCOT: పసికూనతో ఆసీస్ సిరీస్.. జట్టును ప్రకటించిన స్కాట్లాండ్

AUS vs SCOT: పసికూనతో ఆసీస్ సిరీస్.. జట్టును ప్రకటించిన స్కాట్లాండ్

సెప్టెంబరులో యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్ పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు ఆసీస్ తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా తమ స్క్వాడ్ ను ప్రకటించగా..  బుధవారం (ఆగస్ట్ 13) 17 మందితో కూడిన స్కాట్లాండ్ జట్టు తమ స్క్వాడ్ ను ప్రకటించారు. రిచీ బెరింగ్‌టన్‌ స్కాట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు స్కాట్లాండ్ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి.

ఈ జట్టులో స్కాట్లాండ్ స్టార్ ఆటగాళ్లు జార్జ్ మున్సే, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్ ఎంపికయ్యారు. వీరందరూ ఇటీవలే వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రధాన కోచ్ డౌగ్ వాట్సన్ ఈ సిరీస్ పై తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీ పడడం తమకు చక్కని అవకాశమని.. ఈ సిరీస్ గెలవడం పైనే తమ దృష్టాంతా ఉంటుందని ఆయన అన్నారు. 

ఆస్ట్రేలియాతో టీ20లకు స్కాట్లాండ్ జట్టు

రిచీ బెరింగ్‌టన్ (కెప్టెన్), చార్లీ కాసెల్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, జాస్పర్ డేవిడ్‌సన్, క్రిస్ గ్రీవ్స్, ఒలి హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, టేరీ సోల్, బ్రాడ్లీ వీల్