బ్రిడ్జ్‌టౌన్: వర్షంతో తొలి మ్యాచ్ రద్దయినా.. రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న స్కాట్లాండ్ టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నమీబియాను ఓడించింది. టాస్ నెగ్గిన నమీబియా 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసింది. కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (52), జానె గ్రీన్ (28), నికోలస్ డావిన్ (20) రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ 3, బ్రాడ్ కురీ 2 వికెట్లు తీశారు.
తర్వాత స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 157/5 స్కోరు చేసి గెలిచింది. రిచీ బెరింగ్టన్ (47 నాటౌట్), మైకేల్ లీస్క్ (35), మైకేల్ జోన్స్ (26), బ్రాండన్ మెక్‌ములన్ (19) మెరుగ్గా ఆడారు. ఎరాస్మస్ 2 వికెట్లు పడగొట్టాడు. మైకేల్ లీస్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.