- 5 వికెట్లతోఆసీస్ చేతిలో ఓటమి
సెయింట్ లూసియా : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్–8 చేరాలన్న స్కాట్లాండ్ ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు కుమ్మరించింది. ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్–బి ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించింది. ఆసీస్ ముందుగానే బెర్తు దక్కించుకోగా.. ఈ పోరులో గెలిస్తే స్కాట్లాండ్‌కు మరో బెర్త్ లభించేది. దాంతో స్కాటిష్ టీమ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి ఆఖరి ఓవర్‌కూ పోరాడింది. కానీ, కంగారూ టీమ్‌ను పడగొట్టలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 180/5 స్కోరు చేసింది.
మెక్‌ములెన్ (34 బాల్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 60) భారీ షాట్లతో విజృంభించగా.. కెప్టెన్ బెరింగ్టన్ (31 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 42 నాటౌట్), ఓపెనర్ జార్జ్ మున్సే (23 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ రెండు, అగర్, ఎలిస్, జంపా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం ట్రావిస్ హెడ్ (49 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68), మార్కస్ స్టోయినిస్ (29 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) ఫిఫ్టీలతో దంచడంతో ఆసీస్ 19.4 ఓవర్లలో 186/5 స్కోరు చేసి గెలిచింది.
చివర్లో టిమ్ డేవిడ్ (14 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 24 నాటౌట్) సత్తా చాటాడు. మార్క్ వ్యాట్, షరీఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టోయినిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల లభించింది.