T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన

T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న పొట్టి ప్రపంచ కప్ పోరుకు నెదర్లాండ్స్ తమ జట్టును ప్రకటించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వెటరన్ క్రికెటర్లు రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, కోలిన్ అకెర్‌మాన్‌లకు జట్టులో చోటు దక్కలేదు. వీరిద్దరు దేశానికి బదులుగా వారి కౌంటీ కమిట్‌మెంట్లను నెరవేర్చడం పట్ల శ్రద్ధ చూపారు. ఎంపికకు అందుబాటులో లేకుండా పోయారు. 

వాన్ డెర్ మెర్వే గైర్హాజరీతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లుగా టిమ్ ప్రింగిల్, లీవార్డ్ ఐలాండ్స్ యువ స్పిన్నర్ డేనియల్ డోరమ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నెదర్లాండ్స్ జట్టులో కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు తేజ నిడమనూరుకి చోటు దక్కింది.

టీ20 ప్రపంచ కప్‌కు నెదర్లాండ్స్ జట్టు:

స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, డేనియల్ డోరమ్, ఫ్రెడ్ క్లాసెన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓ'డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, టిమ్ ప్రింగిల్ సింగ్, విక్రమ్‌జిత్ కింగ్మా, వెస్లీ బారెసి. 

ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ క్లైన్.

ఎవరీ తెలుగుతేజం..?

తేజ నిడమానూరు స్వస్థలం.. విజయవాడ. చిన్నతనంలో తండ్రి దూరమవడంతో తల్లితో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదిగాడు. అనంతరం తేజకు నెదర్లాండ్స్‌లో ఉద్యోగం రావడంతో.. న్యూజిలాండ్ నుంచి నెదర్లాండ్స్ కు మకాం మార్చాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ.. ఉట్రెక్ట్‌లోని కంపాంగ్ క్లబ్‌ తరపున క్రికెట్ ఆడుతూ నెదర్లాండ్స్ క్రికెట్ సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అక్కడినుంచి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు.