Viral Video: రాజస్థాన్​ బికనీర్​ ఉత్సవంలో.. భారతీయ సంప్రదాయంగా స్కాట్లాంట్​వాసులు పెళ్లి

Viral Video: రాజస్థాన్​ బికనీర్​ ఉత్సవంలో..  భారతీయ సంప్రదాయంగా స్కాట్లాంట్​వాసులు పెళ్లి

భారతీయ సంస్కృతి..సంప్రదాయాలను ప్రపంచ దేశాలు ఆకట్టుకుంటాయి.  భారతదేశంలో హిందువుల ఇళ్లలో జరిగే పెళ్లి తంతు వేడుకల్లో చాలా ఆచారాలున్నాయి.  రాజస్థాన్​ లో జరిగే బికనీర్​ ఒంటెల ఉత్సవంలో ఒక్కటయ్యారు.  రాజస్థాన్​ శైలిలో జరిగిన ఈ పెళ్లి సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. 

భారతీయ సంస్కృతి.. సంప్రదాయాలను అనుసరిస్తూ.. ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనే  విదేశీయులు ఉన్నారా అంటే.. అవును అనే సమాధానం ఈ వీడియో ద్వారా తెలుస్తుంది.    స్కాట్లాండ్‌కు చెందిన ...  జంట బికనీర్ ఒంటెల ఉత్సవంలో రాజస్థానీ ఆచారాలతో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజస్థాన్​ లో జరిగే ఒంటెల ఉత్సవంలో అన్ని దేశాల వారు  పెళ్లిళ్లు చేసుకుంటారు. స్కాట్లాండ్ కు చెందిన జాక్సన్ హింగిస్, రాయిస్ ..   భారతీయ వివాహ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనుకున్నారు.   అనుకోవడమే కాదు అచ్చం భారతీయ సంప్రదాయాల ప్రకారం.. రాజస్థాన్​ శైలిలో పెళ్లి చేసుకున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. 

ఈ వీడియోలో  వరుడు షేర్వానీ..  తలపాగా ధరించి .. చేతితో కత్తిని తిప్పుతున్నాడు.  వరుడు  ఒంటెపై వివాహ వేదికకు  ఊరేగింపుగా వెళ్తాడు. ఈ  ఊరేగింపులో చాలా మంది స్థానికులు పాల్గొన్నారు.  వివాహ వేదిక వద్దకు రావడంతోనే  హారతి, తిలకంతో స్వాగతం పలికారు. వారు రాజస్థానీ దుస్తులు ధరించి నృత్యం చేసినట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. . ఇక వధువు రాయిసిస్​  కూడా సాంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించింది.  నీలిరంగు ఘఘ్రా చోళిలో .. బంగారు ఆభరణాలతో అలంకరించుకుంది. ఈ  వీడియోలో వధూవరులు ఒకరికొకరు దండలు మార్చుకుంటున్నారు.  ఆ తరువాత భారతీయ సంప్రదాయం ప్రకారం...  అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. పెళ్లికి వచ్చిన వారికి స్వీట్లను పంచిపెట్టారు.   

ఈ వీడియోను rajwadi_rudra_16 అనే  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. ఈవీడియోను ఇప్పటి వరకు 4.8 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.  వైరల్​ వీడియోపై నెటిజన్లు స్పందించారు.  రాజస్థాన్ ఆచారాలు, సంస్కృతి విదేశీయులకు కూడా నచ్చుతాయని ఒక వ్యక్తి వ్యాఖ్యానించారు. భారతీయులు ఇలాంటి వివాహా ఆచారాలపై ఆసక్తి చూపకపోయినా.. విదేశీయులు వాటిని గౌరవిస్తున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. ది సనాతన సంస్కృతిలో ఒక ఆచారం. అదృష్టవంతులు మాత్రమే ఇలా భారతీయ ఆచారాన్ని పాటించగలరంటూ.. . జై సత్య సనాతన.. అనా మరొకరు పేర్కొన్నారు.