గుడ్ న్యూస్ : సికింద్రాబాద్‌ - ముజాఫర్‌పూర్‌ మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్

గుడ్ న్యూస్ : సికింద్రాబాద్‌ - ముజాఫర్‌పూర్‌ మధ్య వీక్లీ స్పెషల్  ట్రైన్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.  సికింద్రాబాద్ నుంచి ముజఫర్ పూర్ మధ్య  ప్రత్యేక  రైళ్లను నడపున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హాలిడే రోజుల్లో  రద్దీని తగ్గించడానికి  జనవరి 7, 2025 నుంచి  సికింద్రాబాద్, ముజఫర్‌పూర్ మధ్య మంగళవారం నుంచి శుక్రవారం వరకు వీక్లీ ట్రైన్స్ నడవనున్నాయని తెలిపింది.  

వీక్లీ స్పెషల్ ట్రైన్ నంబర్ 05293 జనవరి 7 ఉదయం 10:40 గంటలకు ముజఫర్‌పూర్ నుంచి  బయలుదేరి జనవరి 8 రాత్రి 11:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అయితే  ఈ రైలు జనవరి 14, 28 మధ్య అందుబాటులో ఉండదని తెలిపారు అధికారులు. జనవరి 9 తెల్లవారుజామున    3:55 గంటలకు  05294 నంబర్  గల రైలు బయలుదేరి జనవరి  10 సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది. అయితే  ఈ రైలు జనవరి 16 ,30 తేదీల్లో అందుబాటులో ఉండదు

ALSO READ | గ్యాప్ ఏర్పడిందని టాక్ వచ్చింది కానీ.. సీఎంతో మీటింగ్ తర్వాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ రైళ్లు హాజీపూర్, సోన్‌పూర్, పాట్లీపుత్ర, దానాపూర్, అరా, బక్సర్, పండిట్‌లలో ఆగుతాయి. డిడి ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, సత్నా, కట్ని, జబల్‌పూర్, నార్సింగ్‌పూర్, పిపారియా, ఇటార్సి, నాగ్‌పూర్, బల్హర్షా, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి,  కాజీపేట్ స్టేషన్‌ల్లో ఆగును. ఈ  ప్రత్యేక రైళ్లలో  సెకండ ఏసీ , థర్డ్ ఏసీ,, థర్డ్ ఏసీ ఎకానమీ,  స్లీపర్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి.