తెలంగాణలో సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (SCR)ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తెలంగాణలో 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
స్పెషల్ ట్రైన్స్ వివరాలు
రైలు నంబర్ 07231 - సికింద్రాబాద్ -నుంచి ఆర్స్‌కేర్ జనవరి10న రాత్రి 7:05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి జనవరి 11వ తేదీ మధ్యాహ్నం1:00 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
రైలు నంబర్ 07232 అర్సికేరే- నుండి మధ్యాహ్నం 2:00 గంటలకు జనవరి 11న ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది
రైలు నంబర్ 07233 సికింద్రాబాద్-ఆర్సీకేరే ఎక్స్ ప్రెస్ .. సికింద్రాబాద్ నుండి రాత్రి 7:05 గంటలకు బయలుదేరి జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటలకు ఆర్సీకేరీ చేరుకుంటుంది.
జనవరి 10, 12, 15, 17 తేదీల్లో విశాఖపట్నం -చెర్లపల్లి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 08533.. విశాఖపట్నం నుంచి ఉదయం 9:45 గంటలకు బయలుదేరి రాత్రి 10:30 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది.
గతంలో SCR తెలంగాణలో సంక్రాంతికి 52 ప్రత్యేక రైళ్లను నడిపింది.